manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 1:37 pm Editor : manabharath

రాఖీ కట్టిన తెలంగాణ రక్షణ యువసేన ప్రతినిధులు

ఆదిలాబాద్ పట్టణం, ఆగస్టు 28 (మన భారత్): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన బోథ్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు నివాసంలో రాఖీ వేడుకలు ఆప్యాయంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేనకు చెందిన కాంతారావు తన కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ బాపురావును కలిశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాథోడ్ బాపురావుకు పుష్పగుచ్ఛం అందించి తమ అభిమానాన్ని, ఆత్మీయతను వ్యక్తం చేశారు.

రక్షాబంధన్ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు కు తెలంగాణ రక్షణ యువసేన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషకరమైన వాతావరణంలో జరిగాయి.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.