manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 11:12 pm Editor : manabharath

ఎస్సీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో అవకాశం..

మన భారత్, ఆదిలాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గాలకు చెందిన వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, విధానాలు, కాంట్రాక్టు పనులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

ఈ నెల 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో ఎస్సీ వర్గాలకు చెందిన ఔత్సాహిక కాంట్రాక్టర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సమాచారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రభుత్వ కాంట్రాక్టు పనులు పొందేందుకు అవసరమైన అర్హతలు, నమోదు ప్రక్రియ, సంబంధిత నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలు తదితర అంశాలపై సదస్సులో అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్‌గా తమ కార్యకలాపాలను ప్రారంభించాలనుకునే ఎస్సీ వర్గాల యువత, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సదస్సుకు హాజరు కావాలనుకునే వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం 7699087550 వాట్సాప్ నంబర్‌కు అవసరమైన ఫారాన్ని పంపించి తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. ముందస్తు నమోదు చేసుకున్న వారికి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, మార్గదర్శకాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారులు, కాంట్రాక్టు రంగంలోకి రావాలనుకునే ఔత్సాహికులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని ప్రభుత్వ అవకాశాలపై పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి