manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 12:53 am Editor : Editor Vishal Kumar

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ మేస్త్రి బండారి కొమురయ్య మొదటి సంవత్సరీకం ఆదివారం వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించిన సంవత్సరీక కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేకంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కొమురయ్య భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వారితో పాటు మండల అధ్యక్షుడు ఎండి రఫీ, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, మంగళపల్లి శ్రీనివాస్, బండారి రాజు, పులి తిరుపతిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.