విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి..
కుచులాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ తలమడుగు,మన భారత్ ఆగస్టు 22: తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న షూలను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు....