నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరుతో మోసం.. ఐదుగురు అరెస్ట్
ఆదిలాబాద్, మన భారత్ ఆగస్టు 21: నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ, ఆన్‌లైన్ లోన్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందలాది ఫిర్యాదులు నిందితులు దేశవ్యాప్తంగా సుమారు 500 సైబర్ నేరాలకు పాల్పడినట్లు...