manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:02 pm Editor : Editor Vishal Kumar

పొన్నారిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తాంసి, మన భారత్,ఆగస్టు,21 : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తాంసి మండల తహశీల్దార్ జాదవ్ గణేశ్ తెలిపారు. తాంసి మండలం పొన్నారి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ జాదవ్ గణేశ్ అర్హత కలిగిన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ఆహార భద్రతతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందే ఇతర సంక్షేమ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మండలంలోని అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తహశీల్దార్ తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో పొన్నారి గ్రామ సర్పంచ్ భూమన్న, మాజీ వైస్ ఎంపీపీ రేఖ రఘు, అశోక్‌తో పాటు గ్రామస్థులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.