manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 4:15 pm Editor : Editor Vishal Kumar

CCI పునర్నిర్మాణం చేయాలి: CTU జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న

12వ రోజు కొనసాగిన దీక్ష.. భూనిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

ఆదిలాబాద్,మన భారత్, ఆగస్టు 20: ఆదిలాబాద్‌లో CCI పునర్నిర్మాణం చేపట్టాలని, ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని CTU జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. CCI పునర్నిర్మాణం కోసం చేపట్టిన దీక్ష 12వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.

ఈ సందర్భంగా లింగాల చిన్నన్న మాట్లాడుతూ CCI పునర్నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయే రైతులు, భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని అన్నారు. భూములు కోల్పోయిన వారికి వారి హక్కులకు అనుగుణంగా తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రాజెక్టు నిర్మాణం లేదా అభివృద్ధి పనుల కారణంగా ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ఎడవిడిగా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామాలకు వెళ్లే మార్గాలను సులభతరం చేసి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

CCI పునర్నిర్మాణం, భూనిర్వాసితుల సమస్యలు, రహదారి సౌకర్యం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని దీక్షలో పాల్గొన్న వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేస్రం కృష్ణ, విఠల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సుభాష్‌నగర్‌కు చెందిన యువకులు దీక్షా శిబిరానికి హాజరై తమ మద్దతు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.