మున్నూరుకాపు సంఘానికి 2 ఎకరాల భూమి కేటాయింపుపై సానుకూల స్పందన
మన భారత్,ఆగస్టు 19, ఆదిలాబాద్: తాలూకా మున్నూరుకాపు సంఘానికి 2 ఎకరాల భూమి కేటాయించాలనే డిమాండ్‌పై సంఘం ప్రతినిధులు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. సంఘం అభ్యర్థనకు అన్ని స్థాయిల్లో సానుకూల స్పందన లభించిందని సంఘం నాయకులు తెలిపారు. తాలూకా మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు మాజీ రాష్ట్ర, కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాలాచారిని కలిసి 2 ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధుల అభ్యర్థనను ఆయన సానుకూలంగా పరిశీలిస్తామని...