మన భారత్,ఆగస్టు 19, ఆదిలాబాద్: తాలూకా మున్నూరుకాపు సంఘానికి 2 ఎకరాల భూమి కేటాయించాలనే డిమాండ్‌పై సంఘం ప్రతినిధులు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. సంఘం అభ్యర్థనకు అన్ని స్థాయిల్లో సానుకూల స్పందన లభించిందని సంఘం నాయకులు తెలిపారు.
తాలూకా మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు మాజీ రాష్ట్ర, కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాలాచారిని కలిసి 2 ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధుల అభ్యర్థనను ఆయన సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
అనంతరం ఆయన ద్వారా ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి సంఘం తరఫున వినతిపత్రం సమర్పించారు. మున్నూరుకాపు సంఘానికి అవసరమైన 2 ఎకరాల భూమి కేటాయింపు అంశంపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ సచివాలయంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్‌ను సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం అభ్యర్థనను పరిశీలించిన ఆయన కూడా సానుకూలంగా స్పందించి, త్వరలోనే 2 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సంఘం నాయకులు వెల్లడించారు.
భూమి కేటాయింపు ద్వారా తాలూకా మున్నూరుకాపు సంఘానికి శాశ్వత వసతులు ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుందని, సంఘ కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని నాయకులు తెలిపారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తోట శివ్వన్న, ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్, ఉపాధ్యక్షులు నం.04 పట్టేపు విలాస్, సంఘం గౌరవ సలహాదారు, ఆదిలాబాద్ మండలం మాజీ జడ్పీటీసీ కొండా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
