ధరంపూరిలో టీఆర్‌ఎస్‌కు భారీ మద్దతు.. 400 మంది పార్టీలో చేరిక
మన భారత్, ఇచ్చోడ:ఆగస్టు19, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా మద్దతు లభించింది. మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ గ్రామ పెద్దలు, యువకులు, కార్యకర్తలు సహా సుమారు 400 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఆయన టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధరంపూరి గ్రామ అభివృద్ధికి చేసిన కృషి తమకు గుర్తుండిపోయిందని పేర్కొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పనిచేశారని తెలిపారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని రాథోడ్ బాపురావు కోరారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
భారీ చేరికతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం
ధరంపూరి గ్రామం నుంచి ఒకేసారి సుమారు 400 మంది టీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పార్టీలో చేరడంతో స్థానికంగా టీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరిందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మడవి రమేష్ పటేల్, మడవి మలుకు దేవరీ, అర్కా గంగారాం మహాజన్, కొమురంభీం జంగు (మాజీ సర్పంచ్), డాక్టర్ సుదర్శన్, నైతం సోమేశ్, కేశవోరావు, సీతారాం, భీంరావు, సురేష్, మాణికరావు, ప్రభాకర్, దోంబెరావు, రాంజీ, భూమేష్, రాము, సోయం దసరత్, గంగారాం, మడవి గంగారాం, షెడమాకి మడవి సాంబాజీ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మండల కన్వీనర్ బిలాల్ బాయ్, మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఫారిద్ హుస్సేన్, నెరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు, ఆసిఫ్, ముస్తఫా, మహ్మద్, ఆఫీస్, గోరి, ఖాలీమ్, అజీమ్, సనాఉల్లా, ఇమ్రాన్, జాకీర్, వాకర్, గంగారెడ్డి, ఆశాభావ, జడ్పీటీసీ హారన్, మారుతీ పటేల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
