పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాల పంపిణీ
మన భారత్, ఆదిలాబాద్ : తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సర్పంచ్ పోరండ్ల సంతోష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన రక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని కార్మికులకు సామగ్రిని అందజేశారు. వర్షాకాలంలోనూ గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికులు నిరంతరం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వర్షంలో తడుస్తూ పనిచేయడం, తడి ప్రాంతాల్లో చెత్తను...