manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 11:59 pm Editor : Editor Vishal Kumar

సమస్యకు సర్పంచ్ వెంకన్న సొంత నిధులతో పరిష్కారం..

అంగన్‌వాడీ కేంద్రంలో తాగునీటి సమస్యకు సర్పంచ్ సొంత నిధులతో పరిష్కారం

తలమడుగు, ఆగస్టు 18, మన భారత్: తలమడుగు మండల కేంద్రమైన కుచులాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌–1లో నెలకొన్న తాగునీటి సమస్యకు సర్పంచ్ మోడేపు వెంకన్న చొరవతో పరిష్కారం లభించింది. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.

చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని సర్పంచ్ మోడేపు వెంకన్న తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రంలోని చిన్నారులకు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు స్పందించే వరకు వేచి చూడకుండా, తనవంతు బాధ్యతగా సొంత నిధులతో సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, గతంలో కూడా కుచులాపూర్ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ మోడేపు వెంకన్న తన సొంత నిధులతో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, చిన్నారులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషిని స్థానికులు, యువత, పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ.. గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల సమస్యలను అధికారులు గుర్తించి, అవసరమైన నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

స్థానికుల అభినందనలు

అంగన్‌వాడీ చిన్నారుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, గతంలో పాఠశాలలో రేకుల షెడ్డు ఏర్పాటు చేసిన సర్పంచ్ మోడేపు వెంకన్నను గ్రామస్తులు, యువత, పెద్దలు అభినందించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందిస్తున్న ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.