manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:49 pm Editor : manabharath

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ

తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేమా సదానందం నానమ్మ కేమా మల్లమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం కప్పర్లలోని సదానందం స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మల్లమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన రాథోడ్ బాపురావు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

మాజీ ఎమ్మెల్యే పరామర్శకు స్థానిక నాయకులు, ప్రజలు హాజరై కేమా సదానందం కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ తాంసీ ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, కప్పర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్, మెంచు కాంతారావు, ఉప సర్పంచ్ నర్సిములు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.