manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 12:59 pm Editor : Editor Vishal Kumar

ఘనంగా ఎర్ర సత్యం ముదిరాజ్ వర్ధంతి

ఎర్ర సత్యం ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

ముదిరాజ్ బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడిన పోరాట యోధుడు, బీసీ ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఎర్ర సత్యం ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం ముదిరాజ్ బీసీ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలు, పోరాటాలు బీసీ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.ఎర్ర సత్యం ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.బీసీ ప్రజలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులు, న్యాయమైన వాటా సాధించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎర్ర సత్యం ముదిరాజ్ చూపిన పోరాట స్ఫూర్తితో బీసీ ప్రజలను ఏకం చేసి, వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, నాయకులు, ముదిరాజ్ నాయకులు పాల్గొని ఎర్ర సత్యం ముదిరాజ్‌కు ఘన నివాళులు అర్పించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.