manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:21 am Editor : manabharath

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల పాత్ర కీలకం

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం

-మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి గ్రామంలోని వ్యాపారస్తులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ ముప్పు సురేష్ గ్రామ ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నేరాలను అదుపు చేయడమే కాకుండా, దొంగతనాలు జరగకుండా, యువత చెడు మార్గాల వైపు పయనించకుండా, నిషేధిత గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామంలో నేరాలు చేసే నేరస్తులను సీసీ కెమెరాల ద్వారా క్షణంలో పట్టుకోవచ్చన్నారు. నేరాల నియంత్రణకు మొగుళ్లపల్లి పోలీసులు ఇచ్చిన పిలుపుమేరకు సీసీ కెమెరాలను ఏర్పాటుకు ముందుకు వచ్చిన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు వ్యాపారస్తులకు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గజ్జి కుమారస్వామి యాదవ్, పంచాయతీ పాలకవర్గం, పోలీసులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.