manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:16 pm Editor : manabharath

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు..

అధికారుల స్పందన కరువు

-మొగుళ్ళ పల్లి వాగు నుండి ఇసుక తరలిస్తే పైన్ తప్పదు

-మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ -రవీందర్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం పరిధిలోని పెద్దవాగు నుండి పలు గ్రామాల కొందరు ట్రాక్టర్ యజమానులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు.అయినప్పటికీ సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ స్వయంగా రంగంలోకి దిగి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై మండిపడ్డారు. స్వయంగా వాగు వద్దకు వెళ్లి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చి, పైన్ విధిస్తామని హెచ్చరించారు.

అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత అధికారుల స్పందన కరువవడం ఎంతో బాధాకరమన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని సమీప వాగుల నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా, రాత్రింబవళ్ళనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తూ..రాత్రిపూట పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా..లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బాధపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేసే వారిపై నిగా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనేకమార్లు జిల్లా, మండల సర్వసభ్య సమావేశాలలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాక్టర్ యజమానులు పర్మిషన్ తీసుకొని ఇసుకను వాగుల పరిధిలోని మండలాలకు మాత్రమే తరలించాలని ఆదేశించినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టడం వెనుక అధికారుల ప్రమేయం ఉందని మేధావులు, ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.