manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:21 am Editor : manabharath

ముడుపు కుటుంబానికి పరామర్శ..

ముడుపు వెంకటమ్మ పెద్దకర్మకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న హాజరు

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు..

తలమడుగు,మన భారత్: మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి మాతృమూర్తి ముడుపు వెంకటమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న హాజరై నివాళులర్పించారు.

వెంకటమ్మ పెద్దకర్మ కార్యక్రమం బరంపూర్ గ్రామంలో నిర్వహించగా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

వెంకటమ్మ మృతి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెంట తలమడుగు మండలంతో పాటు ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని వెంకటమ్మకు నివాళులర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.