ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
అంబుగాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు తాంసి:మన భారత్ ఆగస్టు9, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాంసి మండలంలోని అంబుగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ సమాజం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జెండాను ఆవిష్కరించి ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని పలువురు నాయకులు, యువత, మహిళలు చాటిచెప్పారు. కార్యక్రమానికి తాంసి తుడుం దెబ్బ అధ్యక్షులు ఆత్రం భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా జెండాను...