manabharath.com
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:47 pm Editor : manabharath

ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి ..

ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

-మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగులపల్లి మండలంలోని పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తెలిపారు. ఆదివారం అయినా తెలిపిన వివరాల ప్రకారం కొత్త పెన్షన్లకు మండలంలోని ప్రభుత్వ అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారని తెలిపారు. వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్ సమర్పించాలని , భర్తతో విడిపోయిన విడాకులు పొందిన వారు కనీసం ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు తహసిల్దార్ విచారణ నివేదిక ధ్రువీకరణ పత్రం జత చేయాలన్నారు. వివాహం కాని మహిళలకు 30-35 ఏళ్లు ఉండాలని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లో 40% పైగా వైకల్యం ఉండాలని 50 ఏళ్లు పైబడిన చేనేత గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం సంబంధిత సర్టిఫికెట్లను ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలని ఆయన కోరారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.