డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సామాజిక సేవకు గైర్హాజరు..
కోర్టు ధిక్కరణగా పరిగణన
మన భారత్ | మొగుళ్ళపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు విధించిన సామాజిక సేవకు గైర్హాజరైన యువకుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలానికి చెందిన ఓ యువకుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా భూపాలపల్లి కోర్టు అతడికి రెండు రోజుల సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మొదటి రోజు సామాజిక సేవకు హాజరైన యువకుడు, రెండో రోజు మాత్రం విధులకు గైర్హాజరయ్యాడు.
కోర్టు ఆదేశాలను పాటించకపోవడాన్ని ధిక్కరణగా పరిగణించిన న్యాయస్థానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎంఎఫ్‌సీ కోర్టు యువకుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ సురేష్ వెల్లడించారు.
కోర్టు తీర్పు అనంతరం సంబంధిత యువకుడిని జైలు అధికారులకు అప్పగించి, పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలతో పాటు చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
