manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:43 am Editor : manabharath

కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ అండ

48 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్ ,గుడిహత్నూర్: పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకం ఎంతో ఉపయోగకరమైన సంక్షేమ కార్యక్రమమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. వివాహ సమయంలో పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకం కీలకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో*కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్ల వివాహం పేద కుటుంబాలకు ఆర్థికంగా భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం

కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకానికి అర్హత ఉన్న కుటుంబాలు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ , సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.