manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 10:37 pm Editor : manabharath

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్‌లో ఐసీడీఎస్ నూతన భవనానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి

సెక్రటరీ సృజనకు మంత్రి సీతక్క ఆదేశాలు

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి

ఐసీడీఎస్ కార్యాలయం బోథ్‌లోనే కొనసాగుతుంది: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్,బోథ్: ఆగస్టు 5,బోథ్ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనం లేకపోవడంతోఆ ఐసీడీఎస్ కార్యాలయం తరలిపోనుందంటూ వెలువడిన వార్తలపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించారు. ఐసీడీఎస్ కార్యాలయం బోథ్‌లోనే కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు.

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్‌లో ఐసీడీఎస్ కార్యాలయానికి భవనం లేకపోవడం, కార్యాలయం తరలిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ కార్యాలయం బోథ్‌లోనే కొనసాగించేందుకు నూతన ప్రభుత్వ భవన నిర్మాణం అత్యవసరమని వివరించారు.

ఈ మేరకు ఐసీడీఎస్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. బోథ్‌లోని ప్రజలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే కార్యాలయానికి సొంత భవనం అవసరమని ఎమ్మెల్యే వివరించినట్లు తెలిపారు.

తక్షణమే స్పందించిన మంత్రి సీతక్క

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తిపై మంత్రి సీతక్క వెంటనే స్పందించారు. బోథ్‌లో ఐసీడీఎస్ నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను అందుబాటులో ఉన్న గ్రాంట్ల నుంచి తక్షణమే మంజూరు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సృజనకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న నిధుల నుంచి అవసరమైన మొత్తాన్ని కేటాయించాలని మంత్రి సూచించినట్లు వెల్లడించారు. దీంతో బోథ్‌లో ఐసీడీఎస్ కార్యాలయానికి నూతన భవనం నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బోథ్‌లోనే ఐసీడీఎస్ కార్యాలయం

ఐసీడీఎస్ కార్యాలయం బోథ్ నుంచి తరలిపోతుందనే ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. కార్యాలయం బోథ్‌లోనే కొనసాగుతుందని, నూతన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ సేవలు సులభంగా అందుబాటులో ఉండాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. బోథ్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఐసీడీఎస్ ద్వారా మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సంక్షేమ సేవలు స్థానికంగానే కొనసాగేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బందికి, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు

బోథ్‌లో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమన్నారు

ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంట ఉన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.