చిన్నారులకు తల్లిపాలే శ్రీరామరక్ష..!
సుంకిడిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు చిన్నారుల ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్ష.. పౌష్టికాహారంపై అవగాహన కల్పించిన అధికారులు తలమడుగు, మన భారత్, ఆగస్టు 4: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు తెలియజేయడంతో పాటు చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ఎదుగుదలకు సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పీడీ మిల్కా హాజరై తల్లులు, చిన్నారులతో మాట్లాడారు. చిన్నారుల బరువు పరిశీలన తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా...