manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 1:50 am Editor : manabharath

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి 

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

-మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు నడిగోటి రామ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ,చికెన్ గున్యా , వైరల్ జ్వరాలు అతిసారం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మొగుళ్ళపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగొటి రాము మంగళవారం సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, డ్రబూలు, ట్యాంకులు ,కొబ్బరి చిప్పలు ,పాత టైర్లు ,వంటి వాటిలో నీరు నిలువ కాకుండా తరచూ శుభ్రం చేయాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.