చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం అవసరం..
చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరం: ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణదేవి మన భారత్ | మొగులపల్లి: మొగులపల్లి మండల కేంద్రంలోని నాలుగో అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారుల కోసం అన్నప్రాశన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారి శ్రీహన్స్కు సంప్రదాయబద్ధంగా అన్నప్రాశన నిర్వహించారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆశీర్వాదాల మధ్య కార్యక్రమం ఆనందోత్సాహాలతో సాగింది. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్...