39 ఏళ్ల సేవా ప్రస్థానానికి ఘన ముగింపు..
జెడ్పీహెచ్‌ఎస్ ఛాప్రాలలో జిహెచ్‌ఎం-2 మాధవి–రమేష్ కుర్ర దంపతుల ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఆదిలాబాద్, జూలై 30: విద్య అనేది సమాజ నిర్మాణానికి మూలస్తంభమైతే, ఆ విద్యను అందించే ఉపాధ్యాయులు సమాజ శిల్పులుగా నిలుస్తారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని జీవిత లక్ష్యంగా ఎంచుకుని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించిన జెడ్పీహెచ్‌ఎస్ ఛాప్రాలా జిహెచ్‌ఎం-2 శ్రీమతి మాధవి – శ్రీ రమేష్ కుర్ర ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ నెల...