manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 3:47 pm Editor : Editor Vishal Kumar

కౌడాల నారాయణ సేవలు మరువలేనివి..

తాంసి మండల అభివృద్ధికి కౌడాల నారాయణ సేవలు మరువలేనివి

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకుల పిలుపు

మన భారత్, తాంసి: తాంసి మండల అభివృద్ధికి మాజీ జడ్పీటీసీ, దివంగత కౌడాల నారాయణ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. తాంసి మండలం కప్పర్ల గ్రామంలో బుధవారం కౌడాల నారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు మాట్లాడారు. తాంసి మండల అభివృద్ధి కోసం కౌడాల నారాయణ నిరంతరం కృషి చేశారని, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి చొరవ చూపేవారని కౌడాల సంతోష్ పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. పదవిలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

కౌడాల నారాయణ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని నేటి తరం నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఉప సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ నారాయణ, సదానందం, సంజీవ్, రమేష్, అశోక్, మహేందర్‌తో పాటు గ్రామ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని దివంగత కౌడాల నారాయణకు నివాళులు అర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి