manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:50 pm Editor : manabharath

ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి..

ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి

స్టార్ చిహ్నాలను అలంకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. నిజాయితీ, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచన

మన భారత్, ఆదిలాబాద్: పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బాసర జోన్ పరిధిలోని 18 మంది ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించగా, అందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి. గంగాధర్, అనిత ఉన్నారు.

పదోన్నతి పొందిన అనంతరం ఇద్దరు అధికారులు బుధవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు.

భుజాలపై స్టార్ చిహ్నాలు అలంకరించిన ఎస్పీ

పదోన్నతి పొందిన గంగాధర్, అనిత భుజస్కంధాలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎస్సై పదోన్నతి చిహ్నమైన స్టార్‌ను స్వయంగా అలంకరించారు. అనంతరం ఇరువురు అధికారులకు పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు శాఖలో పదోన్నతి అనేది మరింత బాధ్యతను మోసే అవకాశం అని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలి

పదోన్నతితో అధికారులు తమ విధుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిస్వార్థ సేవలు అందించాలని సూచించారు.

నేర నియంత్రణలో తమవంతు కీలక పాత్ర పోషిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, ప్రజల రక్షణ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు అధికారులు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు.

పదోన్నతి పొందిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, జస్వాల్ కవిత, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి