manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 11:01 pm Editor : Editor Vishal Kumar

కార్యవర్గ విస్తరణకు తీర్మానం..

మున్నూరుకాపు సంఘం కార్యవర్గ విస్తరణకు తీర్మానం

24 మంది కొత్త కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ కమిటీలకు సభ్యుల ఎంపికకు మెజార్టీ ఆమోదం

ఆదిలాబాద్, జూలై 29 (మన భారత్): తాలూకా మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆదిలాబాద్‌లో నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తోట శివ్వన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం భవిష్యత్ కార్యక్రమాలు, కార్యవర్గ విస్తరణ, వివిధ బాధ్యతల కేటాయింపుపై విస్తృతంగా చర్చించారు.

సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొత్తగా 24 మంది కార్యవర్గ సభ్యులను చేర్చుకోవాలని సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కార్యవర్గ సభ్యులు చర్చించి, మెజార్టీ సభ్యుల అంగీకారం మేరకు కొత్త సభ్యులను కార్యవర్గంలోకి తీసుకోవాలని తీర్మానించారు.

అదేవిధంగా సంఘం కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసేందుకు 6 మంది గౌరవ సలహాదారులు, ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేందుకు 5 మంది ఆడిట్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో సంఘం కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 9 మంది మండల కన్వీనర్లు నియమించాలని నిర్ణయించారు.

ఆదిలాబాద్ పట్టణ పరిధిలో సంఘం కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 2 మంది టౌన్ కన్వీనర్లు, అధికారిక వ్యవహారాల నిర్వహణ కోసం 2 మంది అధికార వాక్యాతాలు, సంఘం కార్యక్రమాలు, సమావేశాలు మరియు సామాజిక కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు 1 మీడియా ప్రతినిధి, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1 మహిళా కార్యదర్శిని కొత్తగా కార్యవర్గంలోకి తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.

సంఘాన్ని గ్రామ, మండల, పట్టణ స్థాయిలో మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కార్యవర్గ నిర్మాణం దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. మున్నూరుకాపు సంఘం సభ్యుల ఐక్యత, సామాజిక అభివృద్ధి, సంఘటితంగా ముందుకు సాగడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

కార్యవర్గ విస్తరణకు సంబంధించి తీసుకున్న తీర్మానాన్ని మెజార్టీ కార్యవర్గ సభ్యులు ఆమోదించడంతో తదుపరి చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు.

ఈ సమావేశంలో తాలూకా మున్నూరుకాపు సంఘం ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి