manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 10:25 am Editor : manabharath

టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జ్ నియామకం..

మన భారత్ | ఆదిలాబాద్

తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా మడావి బాపురావు నియామకం

పార్టీ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కల్వకుంట్ల కవితక్క, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆకాంక్ష

ఆదిలాబాద్, జూలై 28 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా మడావి బాపురావును అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలు చేపట్టిన మడావి బాపురావుకు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా క్రమంగా బలోపేతం అవుతోందన్నారు. అదే స్ఫూర్తితో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత విస్తరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి మడావి బాపురావు సమర్థవంతంగా పనిచేస్తారనే పూర్తి నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి చేరవేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మడావి బాపురావుకు సూచించిన రాథోడ్ బాపురావు, ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేస్తే తెలంగాణ రక్షణ సేనను ప్రజల్లో మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన మడావి బాపురావు నాయకత్వంలో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ విస్తరణ వేగవంతమై, ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.