manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 12:27 pm Editor : manabharath

ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షనే..!

కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రభుత్వ ఆసుపత్రులు

మెరుగైన వైద్యం కోసం సిపిఎం జిల్లా కలెక్టర్ ధర్నా

నారాయణపేట: ప్రజలకు మెరుగైన వైద్యం అందుకోవడం అగమ్యగోచరంగా మారిందని నారాయణపేట జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కొరవడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రాంరెడ్డి విమర్శించారు .
సోమవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, జిల్లా మెడికల్ కాలేజీ 97 మంది డాక్టర్లతో నడవాల్సిన ఉండగా కేవలం 30 మంది వైద్యులతో మాత్రమే నడుస్తున్నదని దీనివలన రోజు వారిగా వస్తున్న ఓపి పేషెంట్స్ ఎనిమిది వందల నుండి 1100 మందికి ఓపి పేషెంట్స్ కు మరియు వైద్య విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వైద్య డాక్టర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్ అందించాలని అలా అందిస్తేనే మారుమూల ప్రాంతమైన నారాయణపేటలో డాక్టర్లు పనిచేయడానికి ముందుకు వస్తారని తెలిపారు .
జిల్లా మెడికల్ కాలేజీకి సొంత భవనం లేక జిల్లా ఆస్పత్రి భవనాలలోనే నడుస్తున్నదని మెడికల్ కాలేజీకి సొంత భవనాన్ని వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు తదితర వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కేటాయించి మారుమూల ప్రాంతంలో నారాయణపేట జిల్లా ప్రజలను మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, బి .బలరాం పుంజనం ఆంజనేయులు మాట్లాడారు.
మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రముకు పెద్ద భవనం ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది లేరని రోజుకు 500 మంది హాస్పిటల్ కు రోగులు వస్తున్నారని వారికి సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తపల్లి ప్రాథమిక పల్లె దావకానలో డాక్టర్ లేడని ఫార్మాసిస్టు పోస్టు ఖాళీ ఉందని కేవలం ఆశ వర్కర్ తో నడిపిస్తున్న వైనం. ఇది సీఎం నియోజకవర్గంలో ఉండడం శోచనీయమన్నారు.
కోటకొండ మరికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంచినీటి సౌకర్యం లేదని సరిపడ గదులు లేవని మీటింగ్ హాలు స్టాప్ కు వెయిటింగ్ హాల్ లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మూడు సంవత్సరాలు నుండి రా ఒక రాక కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు .
ధన్వాడ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉన్నదని వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. సబ్ సెంటర్ కి 25 లక్షల నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ సంవత్సరం నర అయినా ప్రారంభానికి నోచుకోకుండా దిష్టిబొమ్మల ఉంచారన్నారు.
కోస్గి మక్తల్ సర్జన్ ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
మక్తల్ లో ఏరియా హాస్పిటల్ భవనం శిథిలావస్థ ఉన్నదని ఎప్పుడు కూలూతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అన్నారు. నూతన భవనాన్ని వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు .
నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ప్రభుత్వ ఆసుపత్రి లేదని ఆందోళన వ్యక్తం చేశారు వంద పడకలతో నూతన ఏరియా హాస్పిటల్ నిర్మించి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని కలెక్టర్ ప్రియాంక గారికి అందజేశారు.
కలెక్టర్ గారు సిపిఎం బృందంతో మాట్లాడుతూ హాస్పటల్లా సమస్యలపై చర్చిస్తున్నామని పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని సరిపడు డాక్టర్లు కేటాయించుటకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గోవింద్ రాజ్ ,జోషి కే కాశప్ప, నరహరి,అరుణ్,దేవప్ప సిపిఎం సోషల్ మీడియా నారాయణపేట పట్టణ కన్వీనర్ సోఫీ మజార్ హుస్సేన్ తదితరులు ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్టాప్ రిపోర్టర్స్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.