manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 5:19 pm Editor : manabharath

సహకార సంఘాల్లో భారీగా అవకతవకలు..!

పేట చేనేత సహకార సంఘాల్లో భారీ అవకతవకలు

అఖిల పక్షం నాయకులు ఆరోపణ

నారాయణపేట జూలై 26 ఆదివారం….

నారాయణపేట జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘాల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆరోపణలు.

గాంధీనగర్ చేనేత కార్మికుల ఇండ్లకు వెంటనే ఇంటి యాజమాన్యపు హక్కులు కల్పించాలి.

నారాయణపేట అంబేద్కర్ భవన్‌లో ఆదివారం రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ పట్టణం కార్యదర్శి కెంచి నారాయణ,తెలుదేశం పార్లమెంటరీ కార్యదర్శి రాములు యాదవ్ మాట్లాడారు

డీసీఓ ఆడిట్ నివేదికల ప్రకారం హెచ్‌డబ్ల్యూసీఎస్‌, గాంధీనగర్, లక్ష్మీ సిల్క్స్‌, సరాఫ్ బజార్‌, చిన్నజత్రం చేనేత సహకార సంఘాల్లో మొత్తం రూ.51 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. టెక్స్‌టైల్ జిల్లా శాఖ అధికారులు, నారాయణపేట పట్టణ సొసైటీల అధ్యక్షులు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.

గత 20 ఏళ్లుగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం జరిగిందని, చేనేత కార్మికులు అప్పుల పాలవుతున్నారు,వలసలు వెల్లుతున్నారని, ఆత్మ హత్యలకు పాల్పపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన సభ్యుల వారసులకు సభ్యత్వం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉన్నప్పటికి ఇతర రాష్ట్రాల నుంచి పవర్‌లూమ్ వస్త్రాలను కొనుగోలు చేసి స్టానికా సొసైటీల ద్వారా స్థానిక చేనేత కార్మికులు తాయారు చేసారని టెస్కోకు అమ్ముతు సొమ్ము చేసుకున్న సహకార సంఘం కార్యవర్గంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు .

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సంబంధిత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

చేనేత సహకార సంఘాల్లో జరిగిన అవినీతి , అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత సొసైటీల లావాదేవీలు, కార్యవర్గాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట పట్టణం లో చేనేత సహకారం వల్ల కార్మికులకు ఎలాంటి ఉపాయోగం లేదని సావుకార్లకే సహకారం అందుతోంది అని విమర్శ చెసారు.

చేనేత కార్మికులకు పించన్ గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రత్యేకంగా ఇవ్వాలని ,అది 4 వేలకు పింఛను పెంచలన్నారు.

అర్హులైన చేనేత కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సహజ మరణంకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు చేనేత చేయూత భీమాలో అక్రమాలు అరికట్టాలన్నారు.

సహకార సంఘాల్లో నాయకుల అక్ర‌మాలు అధికారుల‌ అవినీతి కార్మిక సమస్యల‌పై సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి అఖిల పక్షం పార్టీల ఆద్వర్యం పిర్యాదు చేయబోతున్నామన్నారు

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్లమెంటరీ మాజీ కార్యదర్శులు రాఘవ నాయుడు కాంగ్రెస్ పట్టణ సీనియర్ నాయకులు తుల్జారాం, సిపిఎం పట్టణ కార్యదర్శి కే కాశప్ప , సిపిఎం సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ సోఫీ మజా హుస్సేన్ , సిపిఎం నాయకులు నరహరి చేనేత కార్మికులు నారాయణ నాగేందర్, శ్రీకాంత్ ,వెంకటేష్ దొడ్డి లక్ష్మణ్, వీరన్న లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

మీ విశాల్ కుమార్ ఎడిటర్ మన భారత్ తెలంగాణ.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.