ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఉపకారవేతనాల అవకాశం
2026–27 విద్యా సంవత్సరానికి ఈ-పాస్‌లో ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తుల స్వీకరణ
ఆదిలాబాద్,మన భారత్ జూలై 26: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు కోసం ఈ-పాస్ (E-Pass) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
జిల్లాలోని అర్హత కలిగిన విద్యార్థులు, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఉపకారవేతనాలను మంజూరు చేస్తుందని తెలిపారు.
ఇప్పటికే ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తులు, కొత్తగా అర్హత సాధించిన విద్యార్థులు ఫ్రెష్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసి, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు.
విద్యార్థులు తమ కళాశాలలు, విద్యాసంస్థల సహకారంతో ఈ-పాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలల అధికారులను లేదా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, కన్వీనర్ శ్రీమతి బి. సునీత కుమారి ఒక ప్రకటనలో కోరారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
