సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు
వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా, బెదిరింపులకు దారితీసేలా పోస్టులు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు పాల్పడిన ముగ్గురిపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలో ‘ఆదిలాబాద్ టైమ్స్’...