manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 11:11 pm Editor : Editor Vishal Kumar

బీరన్న బోనాల ఉత్సవాలు..

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలు

మన భారత్,మొగుళ్ళపల్లి:

ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలను కురుమ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో మంగళ వాయిద్యాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకొని ర్యాలీగా బీరన్న గుడి వద్దకు వెళ్లి బోనాలను సమర్పించారు. అనంతరం టెంకాయలను కొట్టి, యాటపోతులతో బీరన్నకు హారతినిచ్చారు ఈ కార్యక్రమంలో రాస బిక్షపతి కురుమ, కురుమ కులస్తులు రాస ఐలయ్య, యాదవ సంఘం మండల నాయకులు కొడారి రాజు యాదవ్, మేకల సమ్మయ్య యాదవ్, ఉడుత బుచ్చయ్య యాదవ్, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.