manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:06 pm Editor : Editor Vishal Kumar

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన..

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన – రోడ్డుపై బైఠాయించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు

మన భారత్, మొగుళ్ళపల్లి:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై పోలీసులు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మొగుళ్ళపల్లి బస్టాప్ సెంటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన లో పాల్గొన్నారు.రాహుల్ గాంధీ కి తగిలిన గాయాన్ని చూపిస్తూ, “ప్రతీకారం తీర్చుకుంటాం” అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతున్న రాహుల్ గాంధీ ని అక్రమంగా అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలపై కేంద్రాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై ఈ దాడి జరిగిందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి రఫీ, నాయకులు ఆకుతోట కుమారస్వామి, క్యాతరాజు రమేష్ , నడిగోటి రాము, తక్కల్లపల్లి రాజు, చాట్ల రవీందర్ , సర్పంచులు,కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.