పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం
మన భారత్, జూలై 23 తలమడుగు:
తలమడుగు మండలం పల్లి (బి) గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావును గ్రామస్తులు కోరారు.
గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సొంత నిధులతో నిర్మించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఆహ్వానించారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత ప్రేరణ కలుగుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్ల సుభాష్ రెడ్డి, మామూళ్ల రాములు, బోనగిరి అశోక్, బోండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
