manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:10 pm Editor : manabharath

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో

రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతాప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యలపై ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, రాహుల్ గాంధీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో కారణంగా సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.