ఆ చెత్తను వెంటనే తొలగించాలి..
అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కిసాన్ చౌక్ వరకు రహదారి డివైడర్లపై పెద్దఎత్తున చెత్త పేరుకుపోయిందని సామాజిక కార్యకర్త ప్రేమకళ ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ చెత్త కారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో పాటు ప్రయాణికులు, ముఖ్యంగా మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు....