manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:23 am Editor : manabharath

బీఆర్ఎస్ బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరికలు

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ నాయకులు

మన భారత్,జూలై 20 తలమడుగు:

బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ ఎస్సీ, ఎస్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వారు అధికారికంగా టీఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో తలమడుగు మండలానికి చెందిన ఆదివాసీ నాయకులు హైదరాబాద్‌కు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు రూప్ సింగ్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌లో చేరిన నాయకులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కొత్తగా చేరిన నాయకుల రాకతో బోథ్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నిమ్మల గజానన్, గడుగు పొచ్చన్న, దేవర్ల స్వామి, నాయిని శ్రీనివాస్, రమేష్, ప్రకాష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.