manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 4:51 pm Editor : Editor Vishal Kumar

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ కార్యాచరణపై అధికారులతో కీలక చర్చ

మన భారత్, ఆదిలాబాద్:

ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 20న ఉట్నూరులో కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, సాగునీటి, తాగునీటి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రత్యామ్నాయ ప్రణాళికలు, రైతులకు అందించాల్సిన సూచనలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాల అందుబాటు, ఎరువుల నిల్వలు, తాగునీటి సరఫరా, పశువులకు మేత, తాగునీటి ఏర్పాట్లు, ఉపాధి హామీ పనుల విస్తరణ పై అధికారులతో చర్చించనున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..