స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్
'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి మతపరమైన అంశానికి సంబంధించిన 'కల్మా'ను హోమ్‌వర్క్‌గా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి...