ఆ అడవి పులులదే.. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోని 8 గ్రామాల తరలింపుకు వేగం
మనుషులు–వన్యప్రాణుల ఘర్షణల నివారణే లక్ష్యం.. పునరావాసానికి ప్రత్యేక కార్యాచరణ మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల సంచారం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ కీలక చర్యలు చేపడుతోంది. పులులకు అనుకూలమైన సహజ ఆవాసాలను పరిరక్షించడంతో పాటు మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు రిజర్వు పరిధిలో ఉన్న ఎనిమిది గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా అడవి జీవావరణాన్ని సంరక్షించడంతో పాటు గ్రామస్తుల భద్రతకు...