manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 11:42 am Editor : manabharath

ఆదిలాబాద్‌లో రేపు జగన్నాథ రథయాత్ర

మధుర జిన్నింగ్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను శనివారం ఉదయం 11 గంటలకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. పట్టణంలోని మధుర జిన్నింగ్ ప్రాంగణం నుంచి రథయాత్ర ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా కొనసాగనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా బండారి అనూష సతీష్ మాట్లాడుతూ, జగన్నాథ స్వామి రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన వేడుక అని పేర్కొన్నారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని రథాన్ని లాగడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారని అన్నారు.

రథయాత్రలో మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు, వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమానికి వచ్చే భక్తులు క్రమశిక్షణతో పాల్గొని నిర్వాహకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రథయాత్ర సందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రథయాత్ర సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు, సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

జగన్నాథ స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర రథయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపునిచ్చారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్..

మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.