పుట్ బోర్డు పై నడిచేది ఎలా.?
ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన దుకాణాలు నడకదారులకు తీవ్ర ఇబ్బందులు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్ వరకు ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌లను దుకాణాల సామగ్రితో ఆక్రమించడంతో నడకదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు వ్యాపార అవసరాలకు వినియోగించబడుతున్న నేపథ్యంలో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. గతంలో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు...