manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 10:47 am Editor : manabharath

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మహాత్మా జ్యోతి బాపులే (MJP) గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ,1 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాత్రలను అందజేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు.భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల కాస్మెటిక్, మెస్ ఛార్జీలను పెంచి నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ డీఎంహెచ్‌ఓ, మధుసూదన్ , మండల వైద్యాధికారిణి నవత,పిఎస్సిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం డి రఫీ, నాయకులు ఆకుతోట కుమారస్వామి క్యాతరాజు రమేష్ ,తక్కల్లపల్లి రాజు,పాఠశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, అదికారులు , ఉపాద్యాయులు,విద్యార్థులు , వైద్య సిబ్బంది, తదితరులు,పాల్గొన్నారు.