మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
మన భారత్,మొగుళ్ళపల్లి:
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో బండి సుదర్శన్ గౌడ్ కుమారుడి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆకినపల్లి గ్రామంలో దూడపాక అజయ్ ,పోతుగల్లు గ్రామంలో రేణుకుంట్ల చందర్ మునిగాల చందర్ ,కోర్కిశాల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సోలెంకి హరీష్. మరణించిన కుటుంబాలను పరామర్శించి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆయన వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య , పిఏసీఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి రఫీ, నాయకులు ఆకుతోట కుమారస్వామి, కోటగిరి సతీష్ గౌడ్, మండ రవి ,క్యాతరాజు రమేష్, తక్కల్లపల్లి రాజు, గజ్జి రాజకుమార్,ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
