manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 9:23 pm Editor : manabharath

డీఎస్పీగా వెంకట నరసయ్య బాధ్యతలు

ఆదిలాబాద్ డీసీఆర్‌బీ డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య బాధ్యతల స్వీకారం

1998 బ్యాచ్ పోలీస్ అధికారి నియామకం.. ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసిన నూతన డీఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నూతన డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఆయనకు ఆదిలాబాద్ డీసీఆర్‌బీ బాధ్యతలు అప్పగించారు.

1998 బ్యాచ్‌కు చెందిన ఎం. వెంకట నరసయ్య పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విధులు నిర్వహించిన ఆయన సీఐడీ విభాగంలో సీఐగా పనిచేశారు. అనంతరం ప్రతిభ ఆధారంగా డీఎస్పీగా పదోన్నతి పొందారు.

బుధవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతన డీసీఆర్‌బీ డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.

డీసీఆర్‌బీ విభాగం ద్వారా నేరాల విశ్లేషణ, పాత కేసుల పరిశీలన, నేర నియంత్రణకు అవసరమైన సమాచార సేకరణ వంటి కీలక అంశాల్లో సమర్థవంతంగా పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

నూతన డీఎస్పీ ఎం. వెంకట నరసయ్య రాకతో జిల్లా పోలీసు శాఖలో మరింత సమన్వయంతో విధులు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.