manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 11:42 pm Editor : manabharath

కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం..

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్‌ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం

ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కర్మన్కార్ బ్రిజ్‌లాల్

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమూద్ అలీ, టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఎంఏ ఫయీమ్ తదితరులు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కర్మన్కార్ బ్రిజ్‌లాల్ పాల్గొన్నారు.

పట్టణంలోని మహాలక్ష్మివాడ, తాటిగూడ, బంగార్గుడ, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం కేఆర్‌కే కాలనీలో మైనార్టీ బాలబాలికల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం తనీషా గార్డెన్‌లో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ బీఎల్‌ఏ-2 సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును రక్షించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.

అలాగే జైనథ్ మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, ఇచ్చోడ మార్కెట్ చైర్మన్ సత్యవతి కోటేష్, ఆత్మ కమిటీ చైర్మన్లు గిమ్మ సంతోష్, రాజు యాదవ్, కౌడాల నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్లు దామోదర్ రెడ్డి, అడ్డి భోజ రెడ్డి, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పసుల చంటి, ఓసావార్ వెంకటి తదితరులు హాజరయ్యారు.

నార్నూర్ మండల అధ్యక్షులు చౌహన్ గోవింద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా, ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్, మైనార్టీ విభాగం చైర్మన్ షాహిద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.