manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:49 pm Editor : manabharath

Sir పక్రియ వేగవంతం చేయాలి

పల్లీ (బి) గ్రామంలో SIR కార్యక్రమం నిర్వహణ

BLA, MRO, BLOలతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

మన భారత్, తలమడుగు:

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తలమడుగు మండలంలోని పల్లీ (బి) గ్రామంలో SIR (Special Intensive Revision) కార్యక్రమం నిర్వహించారు.

BLA కట్కం శ్రీనివాస్, MRO అధికారులు, BLO సిబ్బంది, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమైనదని, ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు సరిగా నమోదు అయ్యేలా చూసుకోవాలని సూచించారు. ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని తెలిపారు.

SIR కార్యక్రమం ద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, అధికారులు పాల్గొని SIR ప్రక్రియను విజయవంతం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..